మంగళవారం 19 జనవరి 2021
National - Dec 28, 2020 , 22:52:03

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం

దంతెవాడ : ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లా కలేపాల్-పోరో కాకారి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన నక్సల్స్‌ ఇద్దరిపై ఏడు లక్షల రివార్డు ఉందని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవా తెలిపారు. కౌకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని  కలేపాల్-పోరో కాకారి అటవీప్రాంతంలో  డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ ఎదురుపడటంతో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు నాటు తుపాకీ, పిస్తోల్ లభ్యమయ్యాయి. మృతి చెందిన మావోయిస్టులను మలంగిర్‌ ఏరియా కమిటీ సభ్యురాలు, ఇంటెలిజెన్స్‌ హెడ్‌ ఐతే మాధవి, మలంగిర్‌ ఏరియా ఇంటెలిజెన్స్‌ వింగ్‌ సభ్యురాలు మార్కం విజ్జిగా పోలీసులు గుర్తించారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.