లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
స్పీకర్ పోచారం | లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నిజామాబాద్ : లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై హైదరాబాద్‌లోని తన అధికార నివాసం నుంచి వీడియో కాల్ ద్వారా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ సమీక్షించారు.
బాన్సువాడ పట్టణంతో పాటు గ్రామాలలో కూడా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
వానాకాలం మొదలైనందున పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. వానాకాలం పంటను జూన్ నెలలో నాట్లు వేయడం ద్వారా నవంబర్ నెల తుఫాను లను తప్పించుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేరకు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు.
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై గ్రామాలు, పట్టణంలోని వార్డుల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన సామగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిదంగా గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

