Rahul Gandhi : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో భారత ప్రభుత్వం వ్యహరించిన తీరుపై లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) లొంగిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారని, ‘నరేందర్ సరెండర్’ అనగానే మోదీ ‘జీ హుజూర్’ అంటూ ఆపరేషన్‌ను నిలిపేశారని రాహుల్ ఆరోపించారు. సరెండర్ కావడం బీజేపీ ఆరెస్సెస్‌లకు అలవాటేనని విమర్శించారు. ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని, కానీ నాడు ఇందిరాగాంధీ ఎవరి బెదిరింపులకూ భయపడలేదని రాహుల్‌గాంధీ అన్నారు.