Girish Mahajan : ఉద్ధవ్ థాకరే (Uddav Tahckeray) వర్గం శివసేన ఎంపీ (Shiv Sena MP) సంజయ్ రౌత్ (Sanjay Raut) పై బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ (Girish Mahajan) తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ రౌత్ ఒక బ్రోకర్ అని, ఆయన ఉండగా ఉద్ధవ్ థాకరేకు వేరే రాజకీయ శత్రువులు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ శివసేన పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయకులను, ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను సంజయ్ రౌత్ దూరం చేస్తున్నారని గిరీష్ మహాజన్ విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేనను బీజేపీకి దూరం చేసి శరద్‌పవార్‌తో, కాంగ్రెస్‌తో కలిసేలా చేసింది సంజయ్ రౌతేనని ఆయన ఆరోపించారు. అప్పుడే శివసేన పతనం మొదలైందన్నారు.
అయితే ఎన్డీఏ కూటమి అధికారం కోల్పోతే బీజేపీని ఎడారిగా మార్చే నాయకుల్లో మంత్రి గిరీష్ మహారాజ్ ముందుంటారని ఇటీవల సంజయ్ రౌత్ ఆరోపించారు. దాంతో రౌత్‌కు కౌంటర్‌గా గిరీష్ తాజా వ్యాఖ్యలు చేశారు. రౌత్ శివసేనను నాశనం చేసినట్లు తాను చేయబోనని అన్నారు. తాను 20 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని వీడలేదని చెప్పారు.