COVID-19 : పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమబెంగాల్ ఆరోగ్య శాఖ అధికారులు (West Bengal health department officials) ఈ విషయాన్ని వెల్లడించారు.
హౌరా సిటీకి చెందిన ఒక మహిళకు కరోనా సోకడంతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనాతోపాటు హృదయ, మూత్రపిండ సంబంధ అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 372కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 11 మంది కరోనా పేషెంట్లు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని, కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య 372కు పెరిగిందని పశ్చిమబెంగాల్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.