Arrest : భారత్ (India) కు చెందిన ఓ పౌరుడు నేపాల్ ఎయిర్‌పోర్టు (Nepal Airport) లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మండు (Khatmandu) లోని త్రిభువన్ ఎయిర్‌పోర్టు (Tribhuvan airport) లో దిగిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడి పోలీసులు వారిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వారిదగ్గర ఏకంగా 10.420 కిలోల మారిజువానా (Marijuvana) అనే మత్తు పదార్థం బయటపడింది.
దాంతో పోలీసులు ఆ డ్రగ్స్‌ను సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిని భారత్‌కు చెందిన పెరీరా గిఫిన్ (29) గా, మరొకరిని థాయ్‌లాండ్‌కు చెందిన సోమాస్క్ పాట్చా (43) గా నేపాల్ పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరూ బ్యాంకాక్ నుంచి నేపాల్ ఎయిర్‌లైన్స్‌లో త్రిభువన్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం పోలీసులు నిందితులిద్దరినీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించారు.