Cholesterol Levels | కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
శరీరంలో కాలేయం సహజంగానే కొలెస్ట్రాల్ ను తయారు చేస్తుంది. కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ప్రారంభమైనప్పుడు వైద్యులు మొదటిగా మందులను సూచిస్తారు. దీని వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
Cholesterol Levels | శరీరంలో కాలేయం సహజంగానే కొలెస్ట్రాల్ ను తయారు చేస్తుంది. కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ప్రారంభమైనప్పుడు వైద్యులు మొదటిగా మందులను సూచిస్తారు. దీని వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అయితే మందులు తీసుకోవడం మాత్రమే సరైన పరిష్కారం కాదని ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగానే తగ్గించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఉన్న ఆహారాలు..
చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా కరిగే ఫైబర్ ను తీసుకోవాలి. ఇది పేగుల్లో జెల్లాంటి పదార్థాన్ని తయారు చేసి బైల్ ఆమ్లాలను కట్టిపడేస్తుంది. బైల్ ఆమ్లాలు కొలెస్ట్రాల్ తో తయారవుతాయి. దీంతో శరీరం మరిన్ని బైల్ ఆమ్లాలను తయారు చేయడానికి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను ఉపయోగిస్తుంది. ఓట్స్, బార్లీ, బీన్స్, పెసర్లు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ 5 నుండి 10 శాతం వరకు తగ్గుతుంది. మొక్కల్లో సహజంగా ఉండే కొలెస్ట్రాల్ లాంటి పదార్థాలు స్టెరాల్స్, స్టానాల్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. కూరగాయలు, పండ్లల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. రోజుకు 3 గ్రాముల వరకు వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 6 నుండి 12 శాతం వరకు తగ్గుతుంది.
ఆలివ్ ఆయిల్, నట్స్, గింజలు..
శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న మాంసాహార ప్రోటీన్లకు బదులు తక్కువ కొవ్వు ప్రోటీన్లు ఉండే సోయా వంటి ఆహారాలను తీసుకోవాలి. రోజుకు 25 గ్రాముల సోయా ప్రోటీన్ ను తీసుకోవడం వల్ల LDL 3-4 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారంలో ఎక్కువగా అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, నట్స్, గింజలు, అవకాడో వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

