అమరావతి : పేకాటలో కొందరు ఆర్థికంగా సర్వస్వం కోల్పోతుండగా మరికొందరు ఆత్మహత్యలు, హత్యలకు గురువుతున్నారు. తాజాగా చిత్తూ రు ( Chittoor ) జిల్లాలో పేకాటలో రూ.2 లక్షల డబ్బులు పోగొట్టుకుని బాకీ పడ్డ యువకుడిపై కాల్పులు( Fire ) జరపడంతో ఒకరు చనిపోయారు.
చిత్తూరు మండలం తుమ్మిందపాళ్యంలో సాయికుమార్ అనే యువకుడిని ఢిల్లీ బాబు అనే మరొకరి పేకాటలో బాకీ పడ్డాడు. దీంతో బాకీ డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తగా ఢిల్లీ బాబు వద్ద ఉన్న నాటు తుపాకీతో సాయికుమార్‌పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అంతడు కుప్పకూలీ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.