Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్లోకి నీరు, బురద ప్రవేశం.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్లో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా టన్నెల్లోకి నీరు, బురుద ప్రవేశించడంతో ఏడుగురు మృతిచెందారు. పలువురు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. చమోలీ జిల్లాలోని పిపల్‌కోట్‌లో ఉన్న తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన టన్నెల్లో ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న టన్నెల్(Uttarakhand Tunnel)లో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా టన్నెల్లోకి నీరు, బురుద ప్రవేశించడంతో ఏడుగురు మృతిచెందారు. పలువురు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. చమోలీ జిల్లాలోని పిపల్‌కోట్‌లో ఉన్న తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన టన్నెల్లో ఈ ఘటన జరిగింది. టీహెచ్‌డీసీ టన్నెల్ నుంచి సుమారు 19 మందిని బయటకు తీసుకువచ్చారు. దీంట్లో ఏడు మంది మృతిచెందినట్లు ద్రువీకరించారు. 13 మంది పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నది. కొందర్ని శ్రీనగర్‌లోని బేస్ ఆస్పత్రికి తరలించారు.
టన్నెల్లో చిక్కుకున్న మిగితా కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టడీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి. టన్నెల్లోకి భారీ స్థాయిలో నీరు ప్రవేశించిందని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ అమృత్ లాల్ మీనా తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన తర్వాత టన్నెల్లో భారీగా నీరు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక ఎక్విప్మెంట్ సహకారంతో మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో సుమారు 22 మంది ఉండి ఉంటారని టీహెచ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ శరద్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

