నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 23 : నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పోషణ మాసం పై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి షకీల్ ,అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం