Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కేంద్రంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సహా అనేక పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. సర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్యే విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సర్ ప్రక్రియ విషయంలో ఇద్దరు కమిషనర్లు 14సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది.
తమకు తెలియకుండానే జ్ఞానేష్ కుమార్ కొన్ని నిర్ణయాలను అమలు చేసినట్లు మిగతా ఇద్దరు సభ్యులు వ్యతిరేకించారు. ఈ విషయం బయటపడటంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జ్ఞానేష్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడిందని విమర్శిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తదితర నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవిలోంచి తొలగించాలని, బీజేపీకి ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించి దేశ ద్రోహానికి పాల్పడ్డ ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Vote chori is a crime against the Indian people and a direct attack on our constitution.
The BJP, RSS and EC who organised it have committed an act of treason.
Justice will be served. pic.twitter.com/30kX06CBiH
— Rahul Gandhi (@RahulGandhi) September 23, 2026
అవసరమైతే ఆయనపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణల్ని బీజేపీ ఖండిస్తోంది. వోట్ చోరీ జరిగితే.. అనేక చోట్ల ప్రతిపక్షాలు ఎలా గెలుస్తున్నాయని ప్రశ్నించారు. ఇందుకు అనేక ఉదాహరణల్ని వివరిస్తున్నారు. ప్రతిపక్షాలకు చేతనైతే సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్లో అభిసంశన తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ సవాల్ చేసింది.