Arrest : ఇద్దరూ సహజీవనం (Live in relation) చేశారు. భర్తాభార్యల్లా (Like wife and husband) జీవించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఆమె అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇది భరించలేకపోయిన అతడు ఆమె నగ్న చిత్రాల (Explicit images) ను సోషల్ మీడియా (Social Media) లో పెట్టాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం కేంద్రపార జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఒక మహిళతో సహజీవనం చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆ ఎడబాటును భరించలేకపోయిన అతడు ఆమెపై కక్ష సాధించడం కోసం నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దాంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ముందస్తు బెయిల్ కోసం అతడు పెట్టుకున్న దరఖాస్తును తోసిపుచ్చింది.