Refueling Planes: ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
Refueling Planes: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో సుమారు అయిదు రీఫ్యూయలింగ్ విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
దుబాయ్: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న రీఫ్యూయలింగ్ విమానాల(Refueling Planes)పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో సుమారు అయిదు రీఫ్యూయలింగ్ విమానాలు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ఓ మీడియా ఈ కథనాన్ని రాసింది. సౌదీ బేస్‌లో ఉన్న విమానాలపై ఇటీవల దాడి జరిగిందని, ఆ దాడిలో స్వల్పంగా ఆ విమానాలు దెబ్బతిన్నాయని, కానీ అవి పూర్తిగా ధ్వంసం కాలేదని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దెబ్బతిన్న రీఫ్యూయలింగ్ విమానాలకు రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక అమెరికాకు చెందిన రీఫ్యుయలింగ్ విమానం .. ఇరాక్ గగనతలంలో గురువారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనలో ఆ విమానంలో ఉన్న ఆరుగురు మృతిచెందినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కేసీ-135 విమానం రీఫ్యుయలింగ్ చేస్తున్న సమయంలో కూలింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. అయితే మరో విమానం మాత్రం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు సెంట్రల్ కమాండ్ చెప్పింది.
రీఫ్యుయలింగ్ విమానం ఎందుకు కూలిందన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు అమెరికా మిలిటరీ అధికారులు చెప్పారు. అయితే శత్రు దేశమో లేక స్నేహపూర్వక ఫైరింగ్‌లో ఆ విమానం కూలలేదని మాత్రం అధికారులు వెల్లడించారు.
⚡️ BREAKING — Unusual | Wall Street Journal:
Five U.S. refueling aircraft were damaged at Prince Sultan Air Base in Saudi Arabia 🇸🇦 after an Iranian missile attack.
The aircraft are currently under repair, and no casualties were reported. pic.twitter.com/J7KMHL1zHM
— Russia TV (@Urgent_RussiaTV) March 14, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

