సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 18:35:35

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌

హైద‌రాబాద్‌: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఎవ‌రి మ‌న‌సును నొప్పించ‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు.  లోక్‌స‌భ‌లో ఇవాళ ప‌న్నుల బిల్లుపై చ‌ర్చ స‌మ‌యంలో మాట‌ల ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది.  పీఎం కేర్స్‌ను విప‌క్షాలు త‌ప్పుప‌ట్ట‌డాన్ని ఖండించిన మంత్రి ఠాకూర్‌.. పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు.  గాంధీ కుటుంబం మాత్ర‌మే ఆ నిధుల‌తో లాభం పొందిన‌ట్లు ఆరోపించారు. బెనిఫిట్ పొందిన వారి పేర్ల‌ను కూడా బ‌య‌ట‌పెడుతానంటూ ఠాకూర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై విప‌క్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ఠాకూర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. ఈ నేప‌థ్యంలో స‌భ మూడు సార్లు వాయిదాప‌డింది. అయితే సాయంత్రం ఆరు గంట‌ల‌కు మ‌రో సారి స‌భ స‌మావేశ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా విజ్ఞ‌ప్తి చేశారు.  స‌భా హుందాత‌నాన్ని స‌భ్యులు గౌర‌వించాల‌న్నారు.  నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌కూడ‌ద‌న్నారు. స‌భ్యులంద‌ర్నీ ర‌క్షించ‌డం త‌న బాధ్య‌త అని, అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌ల చేసిన అనురాగా్ దీనిపై మాట్లాడాల‌న్నారు.  

బిల్లు సంద‌ర్భంగా తాను మాట్లాడిన దాని ప‌ట్ల ఎవ‌రైనా ఇబ్బందిప‌డితే దానికి తాను క్ష‌మాప‌ణ‌లు  చెబుతున్న‌ట్లు అనుగార్ ఠాకూర్ పేర్కొన్నారు. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు.  అనుకోకుండా ఎవ‌రినైనా హార్ట్ చేస్తే క్ష‌మాప‌ణలు చెబుతున్న‌ట్లు ఠాకూర్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. స్ప‌ర్థ‌ల‌ను ప‌రిష్క‌రించిన స్పీక‌ర్‌ను అభినందించారు. స‌భ స‌జావుగా సాగుతుంద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్ ప‌ట్ల ప్ర‌తి స‌భ్యుడికి అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని అధిర్ రంజ‌న్ తెలిపారు. త‌మ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మీపై ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌డం లేద‌ని, మీపై న‌మ్మ‌కం ఉన్న‌ట్లు ఆయ‌న స్పీక‌ర్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. 
logo