మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్ | దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. కార్యక్రమంలో 18-44 ఏళ్లలోపు వారికి 84,599 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోసు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకాల పంపిణీ కార్యక్రమం 106వ రోజుకు చేరగా.. ఒకే రోజు శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 16,48,192 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 94.28 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 62.65 లక్షల మందికి రెండో డోసు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
అలాగే 1.26 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి మోతాదు, 68.78 లక్షల మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది. 45-60 ఏళ్లలోపు 5.33 కోట్ల మంది లబ్ధిదారులు మొదటి, 40 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో 5.26 కోట్ల మందికి మొదటి, 1.14 కోట్ల మందికి రెండో డోస్ వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం సందర్భంగా వలంటీర్ గ్రూపులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
మూడో దశ ఆరు వ్యాక్సినేషన్ ఆరు రాష్ట్రాలోనే
ఇదిలా ఉండగా.. టీకాల కొరత కారణంగా చాల్లా రాష్ట్రాలో మూడో దశ వ్యాక్సినేషన్ శనివారం ప్రారంభం కాలేదు. ఈ విడతలో 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. కేవలం ఆరు రాష్ట్రాలు.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్‌ల్లో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అది కూడా కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మరికొన్ని రాష్ట్రాలు తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఢిల్లీలో సోమవారం మొదలుపెడుతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ నిల్వలు వచ్చాక తేదీలను ప్రకటిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చెప్పారు. తమ వద్ద సరిపడా టీకా డోసులు లేవని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రకటించాయి. టీకా కొరతతో మూడో దశ కొద్ది రోజులు ఆలస్యమవుతుందని కేరళ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

