Minister Komatireddy | భారీ వర్షం కురిసినా హైదరాబాద్లో కరెంటు పోలేదు: మంత్రి కోమటిరెడ్డి
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని తాను అనలేదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆ మాట తాను అన్నట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు.
- మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి
- నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
- వానొచ్చినా హైదరాబాద్లో కరెంటు పోలేదు
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటూ గెలవదు
Minister Komatireddy | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని తాను అనలేదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆ మాట తాను అన్నట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధును నిలుపుదల చేయించాయని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్ని కల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనీసం గ్రామ సభ్యుడు కూడా లేని స్థితికి చేరుకున్నదని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు
బతుకమ్మ పూలలో మందు బాటిల్ ఉంటదని మహిళలకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ.. బతుకమ్మ అంటూ మందు అమ్మిందని నోరుపారేసుకున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్కు కోకాపేటలో కేటాయించిన 11 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు.
భారీ వర్షం కురిసినా హైదరాబాద్లో కరెంటు పోలేదు
హైదరాబాద్లో మంగళవారం గాలి దుమారంతో భారీ వర్షం కురిసినా కరెంటు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వెంటనే అధికారులతో మాట్లాడి కరెంటు సమస్య లేకుండా చూశామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు పోవడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తు సమస్య ఏర్పడినట్టు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

