Mobile tower : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని సఫ్దర్గంజ్ ఏరియా (Safdarganj area) లో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ టవర్ (Mobile tower) కూలిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అక్కడున్న 100 అడుగుల ఎత్తయిన భారీ మొబైల్ టవర్ కుప్పకూలింది. ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు ఈ ఘటన జరిగింది.
అయితే మొబైల్ టవర్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలో శనివారం రాత్రి కుంభవృష్టి కురిసింది. పెద్దఎత్తున ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి తెల్లవారుజామున టవర్ కూలిపోయింది. టవర్ కూలిన దృశ్యాలు కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: A mobile tower in Safdarjung Enclave fell last night as the city received gusty winds and heavy rainfall. pic.twitter.com/Zh2eAVVbil
— ANI (@ANI) June 15, 2025