Helicopter Services : ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర (Chardham Yatra) కు హెలికాప్టర్ సర్వీసుల (Helicopter services) ను రద్దుచేశారు. రెండు రోజులపాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ (Kedarnath) కు వచ్చిన హెలికాప్టర్ తిరిగివెళ్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో అధికారులు రెండు రోజులపాటు చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామి సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రమాదంపై వారితో చర్చించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులపాటు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు.