Aryan Asari : అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో టీవీల్లో , సోషల్ మీడియాలో మళ్లీమళ్లీ చూపిస్తున్నారు. విమానం కొత్త ఎత్తుకు వెళ్లిన తర్వాత క్రమంగా డౌన్ అవుతూ కూలిపోయిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోను అహ్మదాబాద్‌కే చెందిన ఆర్యన్ ఆసరి (Aryan Asari) అనే యువకుడు తీసినట్లు వెల్లడైంది.
ఇదే విషయమై ఆర్యన్ ఆసరిని మీడియా ప్రశ్నించగా అతను ఆ సందర్భాన్ని వివరించాడు. విమానం చాలా తక్కువ ఎత్తులో తనకు దగ్గర నుంచి వెళ్తుండటంతో నా స్నేహితులకు చూపిద్దామని మొబైల్లో వీడియా తీయడం మొదలుపెట్టానని, ఆ తర్వాత కొన్ని సెకన్లలోనే విమానం కిందకు దిగుతూ పెద్ద శబ్ధంతో పేలిపోయిందని చెప్పాడు.
సమీపంలోనే విమానాశ్రయం ఉండటంతో ఆ విమానం ల్యాండ్ అవుతుందని తాను భావించానని, ప్రమాదవశాత్తు ఆ విమానం పడిపోతున్నదని తాను అనుకోలేదని ఆర్యన్ తెలిపాడు. విమానం కూలిపోగానే ఒక్కసారిగా దట్టంగా మంటలు ఎగిసిపడ్డాయని చెప్పాడు. దాంతో తనకు చాలా భయమేసిందని అన్నాడు. వీడియోను మందుగా తన సోదరికి, తండ్రికి చూపించానని, ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి మీడియా దాకా వెళ్లిందని చెప్పాడు.
కాగా గత గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలింది. ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది. విమానం కూలుతున్నప్పుడు ఆర్యన్ ప్రత్యక్షంగా చూడటమేగాక, వీడియో తీశాడు.
ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది, హాస్టల్లోని 38 మంది కలిపి మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా కేవలం రమేష్ విశ్వాస్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్టల్లో ఉన్న వారిలో 24 మంది ఘటన జరిగినప్పుడే చనిపోగా చికిత్స పొందుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
#WATCH | #AhmedabadPlaneCrash | Aryan Asari, the boy who recorded a viral video showing the crash of Air India flight 171 on 12th June, says “I came here on June 12. The plane was passing from very close, so I thought of shooting a video so I could show it to my friends. The… pic.twitter.com/tGOZPrBgNa
— ANI (@ANI) June 15, 2025