“హే బలవంత్’కు క్రేజీ రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో నేను పోషించిన ‘బంక’ పాత్రను ఆడియన్స్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు’ అని నటుడు సుదర్శన్ ఆనందం వెలిబుచ్చారు. సుహాస్, శివానీ నాగరం జంటగా.. గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్రరెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బలవంత్’. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఇందులో కమెడియన్‌గా నటించిన సుదర్శన్ బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు.
కథలో ప్రాధాన్యత ఉండబట్టే తన పాత్ర బాగా ఎలివేట్ అయ్యిందని, డ్రింకింగ్ సీన్‌కూ, వెన్నెల కిశోర్ కాంబినేషన్లో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్లన్నీ నవ్వులతో ఊగిపోతున్నాయని, తనతోపాటు వెన్నెల కిశోర్, సుహాస్, నరేష్ ఇలా అందరూ హిలేరియస్‌గా నవ్వించారని సుదర్శన్ చెప్పారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యమనీ, టాలీవుడ్ స్టార్‌హీరోలందరితో కమెడియన్ నటించాలనుందని, ‘మృత్యుంజయ’, ‘గోదారి గట్టు మీద’ చిత్రాల్లో మంచి పాత్రలు చేశానని, త్వరలోనే ఆ సినిమాలు విడుదల కానున్నాయని, వీటితోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నానని సుదర్శన్ తెలిపారు.