శుక్రవారం 10 జూలై 2020
National - Jun 16, 2020 , 18:16:03

మహిళ ప్రాణాలు తీసిన గ్లాస్ డోర్..వీడియో

మహిళ ప్రాణాలు తీసిన గ్లాస్ డోర్..వీడియో

ఎర్నాకులం: కేరళలోని ఎర్నాకులం జిల్లాలో గ్లాస్‌డోర ఓ మహిళ ప్రాణాలు తీసింది. బీనాపాల్‌ (40)అనే మహిళ సోమవారం ఎర్నాకులం జిల్లా పెరుంబవూర్‌ బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు బయట పార్కు చేసిన తన కారులో మర్చిపోయిన వస్తువు ఒకటి తీసుకరావడానికి బీనాపాల్‌ హడావుడిగా బయలుదేరింది. బ్యాంకు ఎంట్రెన్స్‌లో ఉన్న గ్లాస్‌ డోర్‌ తెరిసి ఉందనుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది బీనాపాల్‌. అయితే డోర్‌ మూసిఉండటంతో వేగంగా వచ్చిన బీనాపాల్‌ తలకు గ్లాస్‌ డోర్‌ గట్టిగా తగిలింది. డోర్‌ పగిలి ముక్కలవడంతో ఆమె తలకు గాయాలయ్యాయి.

గ్లాస్‌ ముక్క ఒకటి బీనాపాల్‌ పొత్తికడుపులో గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతో ఉన్న బీనాపాల్‌ను కొంతమంది ఆస్పత్రికి తరలించారు. అయితే కడుపులోపల తీవ్రంగా రక్తస్రావం అవడంతో ఆ మహిళ ప్రాణాలు విడిచింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముగ్గు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. 
logo