శనివారం 28 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 16:54:41

అమెరికా చ‌లి దుస్తుల్లో భార‌తీయ సైనికులు

అమెరికా చ‌లి దుస్తుల్లో భార‌తీయ సైనికులు

ఢిల్లీ : శీతాకాలంలో చ‌లి తీవ్ర‌త ఎలా ఉంటుందో అంద‌రికి తెలిసిందే. ద‌క్క‌న్ పీఠ‌భూమిలో నివ‌సించే మ‌న‌మే కొన్ని సార్లు చ‌లి చంపేస్తుంది అంటుంటాం. మ‌రి అలాంటిది హిమాల‌య సానువుల్లో, ఎముక‌లు కూడా గ‌డ్డ‌క‌ట్టే వాతావ‌ర‌ణాన్ని క‌లిగిఉన్న సియాచిన్ గ్లేసియ‌ర్‌, ల‌డాఖ్ వంటి త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌హారా కాసే మ‌న‌ సైనికుల ప‌రిస్థితులు ఏంటో ఊహించుకోవ‌చ్చు. దేశం కోసం ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి ప‌హారా కాసే సైనికుల ధైర్య‌సాహ‌సాలు వెల‌క‌ట్ట‌లేనివి. ఇటీవ‌ల చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం సైన్యం కోసం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా శీతాకాలం ప్ర‌వేశించడంతో చైనా స‌రిహ‌ద్దు వెంబ‌డి సైనికుల‌కు అత్యంత చ‌లిని సైతం త‌ట్టుకునే దుస్తువుల‌ను అంద‌జేసింది. అమెరికా నుంచి వీటిని దిగుమ‌తి చేసుకుని తూర్పు ల‌ఢక్, సియాచిన్‌‌లోని సైనికుల‌కు అంద‌జేసింది. వీటితో పాటు సిగ్ సౌర్ అసాల్ట్ రైఫిళ్ల‌ను అందించింది.