దేశంలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు
యాక్టివ్ కేసులు| దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. మార్చి మొదటి వారం తర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. మార్చి మొదటి వారం తర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన రోజువారీ కేసులు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 3.5 లక్షలకు లోపే నమోదయ్యాయి. అయితే నిన్నటికంటే కొత్త కేసులు కొద్దిగా పెరగడం ఆందోళనకలిగించే విషయమే..!
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 3.5 లక్షలలోపు కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా రెండో రోజు కావడం విశేషం. యాక్టివ్ కేసులు కూడా మరో నాలుగు వేలు తగ్గడంతో 37 లక్షలకు పడిపోయాయి. ఈ నెల 6న అత్యధికంగా ఒకేరోజు 4,14,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3,29,942 కేసులు రికార్డయ్యాయి.
దేశంలో కొత్తగా 3,48,421 నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,33,40,938కు చేరాయి. ఇందులో 37,04,099 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,93,82,642 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 2,54,197 మంది కరోనాతో మరణించారు. ఇక గత 24 గంటల్లో 4205 మంది మరణించగా, కొత్తగా 3,55,338 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదేవిధంగా 17,52,35,991 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.
ఇక నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. గత శుక్రవారం అత్యధికంగా 4185 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు. దీంతో గత 14 రోజుల్లో 50 వేల మంది కరోనాతో కన్నుమూశారు. అంటే రోజుకు 3528 మంది చొప్పున చనిపోయారన్నమాట. తాజా మరణాలతో మొత్తం మృతులు 2.5 లక్షలు దాటారు.

మహారాష్ట్రలో మరోమారు మరణాలు పెరిగాయి. గత రెండు రోజులుగా 600 కంటే తక్కువగా నమోదవుతుండగా, ఇప్పుడది 793కు చేరింది. తమిళనాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మరణాలు అధికమయ్యాయి.
మొదటి నుంచి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్న మహారాష్ట్రలో రోజువారీ కేసులు తగ్గుతుండగా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో క్రమంగా అధికమవుతున్నాయి. 26 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు ఉండగా, ఈ రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సెకండ్‌డోస్‌కు ప్రాధాన్యం!
ఆ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..
మహారాష్ట్రలో మరో రెండు వారాలు లాక్డౌన్!
యూకే.. యురేకా! బ్రిటన్‌లో జీరో మరణాలు..
సింగిల్ డోస్‌తోనే! మరణాల ముప్పును 80% తగ్గిస్తున్న ఆస్ట్రాజెనెకా టీకా
విదేశీ టీకాలే దిక్కు!
టీకా ఫార్ములాను అందించండి!
తెలంగాణ లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- యాక్టివ్ కేసులు
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

