e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News తెలంగాణ లాక్‌డౌన్‌.. య‌థావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు

తెలంగాణ లాక్‌డౌన్‌.. య‌థావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు

తెలంగాణ లాక్‌డౌన్‌.. య‌థావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు

హైద‌రాబాద్ : గ‌త లాక్‌డౌన్ స‌మ‌యంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు య‌థావిధిగా ప‌ని చేస్తాయ‌ని తెలంగాణ కేబినెట్ స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి అని తెలిపింది. లాక్‌డౌన్ నుంచి ప్రింట్ అండ్ ఎల‌క్ర్టానిక్ మీడియాకు మిన‌హాయింపు ఇచ్చింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

Lockdown : రేప‌ట్నుంచి తెలంగాణ‌లో లాక్‌డౌన్‌

పెండ్లిళ్లకు 40 మంది, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి

తెలంగాణలో కొత్తగా 4,801 కరోనా కేసులు.. 32 మంది మృతి

తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు ఇవే..వీటికే అనుమతి

తెలంగాణ‌లో య‌థావిధిగా ధాన్యం కొనుగోళ్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ లాక్‌డౌన్‌.. య‌థావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు

ట్రెండింగ్‌

Advertisement