18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. మూడో దశ వ్యాక్సినేషన్లో 18-44 ఏళ్ల మధ్య వయస్సున వారికి టీకాలు వేస్తుండడంతో కేంద్రం నేరుగా టీకాలు ఉత్పత్తి చేస్తున్న కంపెనీల వద్ద కొనుగోలు చేసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ టీకాకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చి కేటాయింపుల ఆధారంగా ఈ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపుతున్నట్లు కంపెనీ ఎండీ సుచిత్రా ఎల్లా ఇటీవల తెలిపారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను కంపెనీ రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తోంది.
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

