గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు | ఇజ్రాయెల్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భీకరదాడులతో అటు ఇజ్రాయిల్, గాజా దద్దరిల్లుతున్నాయి.

జెరూసలేం : మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భీకరదాడులతో అటు ఇజ్రాయిల్, గాజా దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లను ఉప్రయోగించగా.. గాజాపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం తెల్లవారు జామున వైమానిక దాడులు జరిపాయి. దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 35 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడగా.. ఇజ్రాయెల్‌లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జెరూసలెంలోని అల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ హమాస్ ఉగ్రవాదులు.. సోమవారం సాయంత్రం 500కుపైగా రాకెట్లను ప్రయోగించారు.
దీంతో ఇజ్రాయెల్ బలగాలు గాజాపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు దుర్మణం చెందారు. పెద్ద ఎత్తున జనం గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కనీసం 16 మంది హమాస్ ముష్కరులు ఉన్నారని ఇజ్రాయెల్ బలగాలు పేర్కొన్నాయి. వైమానిక దాడులకు గాజాలో 13 అంతస్థుల భవనం కూలిపోయింది. మరో భవనం దెబ్బతింది. గాజా నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో తమ కమాండర్లు ముగ్గురు మరణించారని హమాస్ ఉగ్రవాద ముఠా పేర్కొంది. దాడుల ఘటనపై యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఇరుపక్షాలు హింసను ఆపాలని యూఎన్ మిడిల్ ఈస్ట్ ప్రతినిధి టోర్ వెన్నెస్లాండ్ సూచించారు.

దాడుల్లో భారతీయ మహిళ మృతి
హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడుల్లో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. ఇజ్రాయెల్ అష్కెలాన్ నగరంలో కేర్ టేకర్‌గా పని చేస్తున్న కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన చెందిన సౌమ్య మంగళవారం తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతోంది. ఈ సమయంలోనే ఆమె ఉంటున్న ఇంటిపై పడడంతో ఆమె మృతి చెందారు.
లాడ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన నెతన్యాహు
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లాడ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఉన్నతాధికారులు, న్యాయ అధికారుల సమావేశం అనంతరం నెతన్యాహు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 1966లో ఇజ్రాయెల్ అరబ్బులపై సైనిక పరిపాలన ముగిసిన తరువాత.. ఇజ్రాయెల్‌లోని ఒక అరబ్ సమాజంపై అత్యవసర అధికారాలను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. హమాస్ ఉగ్రవాదులపై దాడుల తీవ్రతను పెంచాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ సైనిక చర్యతో గాజా ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఇకపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సెకండ్‌డోస్‌కు ప్రాధాన్యం!
బాలుడి దాతృత్వం.. గిఫ్ట్‌గా సైకిల్ ఇచ్చిన స్టాలిన్
భారత్‌కు ట్విట్టర్ రూ.110 కోట్ల సాయం
యూకే.. యురేకా! బ్రిటన్‌లో జీరో మరణాలు..
సింగిల్ డోస్‌తోనే! మరణాల ముప్పును 80% తగ్గిస్తున్న ఆస్ట్రాజెనెకా టీకా
విదేశీ టీకాలే దిక్కు!
టీకా ఫార్ములాను అందించండి!
తెలంగాణ లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

