మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 15:33:52

ఢిల్లీలో ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచిన ఐసీఎమ్మార్‌

ఢిల్లీలో ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచిన ఐసీఎమ్మార్‌

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో అక్క‌డ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు అయిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ఢిల్లీలో రోజుకు 27 వేలుగా ఉన్న ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని రోజుకు 37,200కు పెంచిన‌ట్లు హోంశాఖ వెల్ల‌డించింది. 

రోజువారీ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం పెంచ‌డంతో సేక‌రించే శాంపిల్స్ సంఖ్య భారీగా పెరిగిందని హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. న‌వంబ‌ర్ 19న ఒక్క‌రోజే ఢిల్లీలో 30,735 ఆర్టీ-పీసీఆర్ శాంపిల్స్ సేక‌రించిన‌ట్లు అధికారులు తెలిపారు. న‌‌వంబ‌ర్ 15న సేక‌రించిన‌ మొత్తం ఆర్టీ-పీసీఆర్ శాంపిళ్ల సంఖ్య కేవ‌లం 12,055 మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.   ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.