డెహ్రాడూన్: చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు.
భక్తులను శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అనుమతించారు. భక్తులు ‘హరహర మహాదేవ’, ‘జై మా యమున’ అంటూ నినాదాలు చేశారు. భారత సైన్యంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భక్తి గీతాలను ఆలపించింది. ఈ దేవాలయాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. హెలికాప్టర్ నుంచి పూలను భక్తులపైకి జల్లారు.