దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది బలి
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది మృత్యువాత | దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నిన్న నాలుగువేలకుపై మరణాలు నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 4,529 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా 3,89,851 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కి పెరిగాయి.
ఇప్పటి వరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. మొత్తం 2,83,248 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో భాగంగా 18,58,09,302 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న భారీగా కొవిడ్ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20.08లక్షల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32.03 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
ఘోరం.. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి
హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి!
‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

