‘బ్లడ్ క్లాటింగ్’ లక్షణాలు!
- కనిపిస్తే టీకా వేసుకున్న కేంద్రంలో తెలియజేయాలి
- కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు సీరమ్ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం స్వల్ప కేసుల్లో (10 లక్షల డోసులకు 0.61 కేసుల్లో) రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాటింగ్) వంటి సమస్యలు తలెత్తినట్టు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పేర్కొనడం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లో కింద పేర్కొన్న సమస్యలు ఎదురైతే, బాధితులు టీకా వేసుకున్న సంబంధిత కేంద్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
రక్తం గడ్డకట్టడంలో భాగంగా కనిపించే కొన్ని లక్షణాలను ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవి..
ఊపిరి ఆడకపోవడం
ఛాతీలో నొప్పి
భుజం, కాలి పిక్కలో వాపు/నొప్పి
టీకా వేసిన ప్రాంతంలో సూదిమొన సైజులో ఎర్రగా ఉండటం, గాయాలు
నిరంతరం కడుపునొప్పి, ఒక్కోసారి వాంతులు
మూర్చ, తీవ్రమైన తలనొప్పి
బలహీనత, ముఖంతోసహా కొన్ని శరీర భాగాలు మొద్దుబారిపోవడం
కారణంలేకుండా నిరంతరాయంగా వాంతులు
కండ్లలో మంట, చూపు మసకబారడం, దృశ్యాలు రెండుగా కన్పించడం
గందరగోళంగా అనిపించడం, మానసికంగా స్థిమితంలేకపోవడం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blood clotting
- symptoms
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

