న్యూఢిల్లీ, మే 10: మనీ లాండరింగ్ కేసులో తన కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈడీ తనను అరెస్ట చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో తాను వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది.
ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సొరేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ నెల 3న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఈ పిటిషన్ వృథా అని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే వారం విచారిస్తామని పేర్కొన్నది.