Samyuktha Menon | టాలీవుడ్లో వరుస విజయాలనందుకుని స్టార్హీరోయిన్గా ఎదిగింది సంయుక్త మీనన్. ప్రస్తుతం మాతృభాష మలయాళంలో కూడా విరివిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది సంయుక్త. బహుభాషల్లో నటిస్తున్నావు కదా? ఏ భాషలో నటించడం సౌకర్యంగా ఉంటుంది? అనే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అందాలబొమ్మకు ఎదురైంది. దీనికి సంయుక్త తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
‘నాకు నటించడం ఇష్టం. భాష ఏదైనా ఎంజాయ్ చేస్తూ నటిస్తాను. అయితే.. సౌకర్యం అంటున్నారు కాబట్టి, మాతృభాషలో ఉన్నంత సౌకర్యం మిగతా భాషల్లో నటించేటప్పుడు ఉండదుకదా.. పైగా మలయాళంలో మేకప్ కూడా లైట్‌గా వేస్తారు. ఇక్కడ నేచురల్‌గా కనిపించాలి, నేచురల్‌గా నటించాలి. టాలీవుడ్ అలా కాదు, అక్కడ మేకప్ ఎక్కువ ఉంటుంది. యాక్టింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. షాట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మేకప్ చెక్ చేసుకోవాలి. చర్మంపై ఏదో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అది కాస్త అసౌకర్యమేకదా.’ అని చెప్పుకొచ్చింది సంయుక్త.