పుణె: హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో దాదాపు పదకొండేండ్ల తర్వాత పుణె కోర్టు తీర్పు చెప్పింది. సెషన్స్ జడ్జి పీపీ జాదవ్ శుక్రవారం తీర్పు చెప్తూ, సచిన్ అందురే, శరద్ కలస్కర్లకు జీవిత ఖైదు, రూ.5 లక్షలు జరిమానా విధించారు. డాక్టర్ వీరేంద్ర సింగ్ తవడే, విక్రమ్ భవే, సంజీవ్ పునలేకర్ నిర్దోషులని తెలిపారు.
నిర్దోషులుగా నిర్ధారణ అయిన ముగ్గురూ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరికి సంజీవ్ న్యాయవాదిగా పని చేశారు. అయితే సాక్ష్యాధారాలను అదృశ్యం చేశారని ఆరోపిస్తూ ఆయనను అరెస్ట్ చేశారు. దభోల్కర్ వృత్తి రీత్యా వైద్యుడు. ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. దీంతో ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఆయనను చంపుతామని చాలా మంది బెదిరించేవారు.