Rashi Khanna |ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘అరాణ్మనై 4’ (తెలుగులో ‘బాక్’) తన కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, ఈ ఏడాది తొలి విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ రాశీఖన్నా. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను పోషించిన డాక్టర్ మాయ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ కథ విన్నప్పుడే సినిమా విజయం తథ్యమని భావించా. ఇక నా పాత్ర కథాగమనంలో కీలకంగా ఉందని అంటున్నారు. ఇప్పటికీ థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో నా నమ్మకాలు నిజయ్యాయి. దక్షిణాదిలో ఈ ఏడాది మరిన్ని సినిమాలు చేయడానికి ‘అరణ్మనై 4’ విజయం స్ఫూర్తినిచ్చింది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘ది సబర్మతి రిపోర్ట్’ ‘టీఎమ్ఈ’ చిత్రాలతో పాటు తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో నటిస్తున్నది