టేకులపల్లి, మార్చి 12 : ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గోనెల విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పేగళ్లపాడు పంచాయతీ తెలగూరులో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోనెల కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. విజయలక్ష్మి జడ్పీ చైర్మన్ గా ఖమ్మం జిల్లాలో చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు భూక్య దల్ సింగ్ నాయక్, మండల అధ్యక్షుడు బొమెర్ల వరప్రసాద్, ఉపాధ్యక్షుడు చీమల సత్యనారాయణ, ఇల్లెందు టౌన్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నబీ, కుమ్మరి కిరణ్, మూలగుండ్ల ఉపేందర్ రావు, మునగంటి శివ, కె.శ్యామ్, వాసు పాల్గొన్నారు.