Naga Chaitanya | అక్కినేని వారసుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుసగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, టాలెంటెడ్ దర్శకుడుకార్తీక్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వృష కర్మ’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
తాజాగా నాగ చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. “Being Arjun” అనే క్యాప్షన్‌తో ఆయన జిమ్‌లో తీసుకున్న ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో చైతు 6 ప్యాక్ బాడీతో స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. డంబెల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తున్న ఫోటో ద్వారా ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో చూపించాడు. ఇటీవల వచ్చిన తండేల్ సినిమాలో నాగ చైతన్య డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ‘వృష కర్మ’ కోసం మాత్రం పూర్తిగా స్టైలిష్ మరియు ఫిట్ లుక్‌లోకి మారడం విశేషంగా మారింది.
నాగ చైతన్య ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. హీరో సుశాంత్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్‌పై స్పందించగా, వేలాది మంది అభిమానులు ఫైర్ ఎమోజీలు, లైక్స్‌తో కామెంట్స్ సెక్షన్‌ను హోరెత్తించారు. “అన్నా నీ మూవీ కోసం వెయిటింగ్”, “వృషకర్మ ఇన్ యాక్షన్”, “చైతు ట్రాన్స్ఫర్మేషన్ సూపర్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ కొత్త లుక్కు కారణమైన ఫిట్నెస్ ట్రైనర్ కూడా స్పందిస్తూ, “నీ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నా వంతు పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది” అని రిప్లై ఇవ్వడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉండగా నాగ చైతన్య సెట్స్‌కి సంబంధించిన మరికొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్స్‌లో తీసిన ఈ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘వృష కర్మ’ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.