Farooq Abdullah | ‘ఆ దేవుడే నన్ను కాపాడాడు’.. హత్యాయత్నంపై స్పందించిన ఫరూఖ్ అబ్దుల్లా
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయనపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేందుకు ప్రయత్నించాడు.
Farooq Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయనపై ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేందుకు ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ గురితప్పడంతో ఫరూఖ్ అబ్దుల్లా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఆ భగవంతుడే తనను రక్షించాడని (God Saved Me) అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. వివాహ వేదిక నుంచి
వస్తుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది తనను కారులో ఎక్కించి
అక్కడినుంచి పంపించేశారని చెప్పారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంవల్లే తాను ఈ ఘటన నుంచి
బయటపడగలిగానని అన్నారు. దాడి వెనక ఉద్దేశం ఏమిటనేది నాకు తెలియదని చెప్పారు.
ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని, క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారని అన్నారు. ఇక ఫరూక్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల విషయంపై జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

