టేకులపల్లి, మార్చి 12 : టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గడప గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలునాయక్, ఉపాధ్యక్షులు బానోతు రామా నాయక్, చీమల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు జాలాది అప్పారావు, భూక్యా బాలకృష్ణ, ఉద్యమకారులు తేజావత్ రవి, భూక్యా లాలు నాయక్, కుమ్మరి కిరణ్, మహిళా మండల అధ్యక్షురాలు ఆమెడ రేణుక, బానోతు కిషన్ నాయక్, యూత్ మండల అధ్యక్షుడు, రాంపురం సర్పంచ్, బర్మావత్ శివకృష్ణ, ఉప్పల శ్రీనివాస్, శంకర్, జెబ్బ విజయలక్ష్మి, బానోతు రవి, రవీందర్, సర్పంచులు రామా నాయక్, లకవత్ నాకా నాయక్, లక్ష్మణ్ నాయక్ నరేష్ నాయక్, ఉప సర్పంచ్ ఏ.వసంత, ఆమెడ నాగభూషణం పాల్గొన్నారు.

టేకులపల్లిలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం