IND vs ZIM | మెరిసిన ఇషాన్, అభిషేక్.. అయ్యర్ సారథ్యంలో తొలి పొట్టి సిరీస్ కైవసం..!
IND vs ZIM : వరసగా రెండు వైట్‌వాష్‌లను నుంచి తేరుకున్న భారత జట్టు అదిరే ఆటతో టీ20 సిరీస్ పట్టేసింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
IND vs ZIM : వరసగా రెండు వైట్‌వాష్‌లను నుంచి తేరుకున్న భారత జట్టు అదిరే ఆటతో టీ20 సిరీస్ పట్టేసింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇషాన్ కిషన్(81), తిలక్ వర్మ(60 నాటౌట్) మెరుపులతో ప్రత్యర్థికి భారీ లక్ష్యా్న్ని నిర్దేశించిన అయ్యర్ సేన 90 పరుగుల తేడాతో గెలిచింది. 220 పరుగుల ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లను ప్రిన్స్ యాదవ్(2-10), అభిషేక్ శర్మ(3-17)లు బెంబేలెత్తించారు. సమిష్టి వైఫల్యంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆఫ్రికా జట్టు మరో ఓటమి చవిచూసింది.
పొట్టి క్రికెట్లో మళ్లీ ఫామ్ అందుకున్న భారత జట్టు టీ20 సిరీస్‌ను కొల్లగొట్టింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలిచిన టీమిండియా రెండో టీ20లోనూ జింబాబ్వేను వణికించింది. రికార్డు స్థాయిలో 52వ సారి రెండొందలకు పైగా కొట్టిన భారత్.. ప్రత్యర్థిని పరిమితం చేసింది. టాపార్డర్ విఫలమైనా బ్యాటుతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్(81), తిలక్ వర్మ(60 నాటౌట్)లు భారీ స్కోరొందించగా.. అనంతరం ప్రిన్స్ యాదవ్(2-10), అభిషేక్ శర్మ(3-17)లు వికెట్ల వేటతో చెలరేగారు. బ్యాటుతో విఫలమైన అభిషేక్.. మూడు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129కే ఆలౌటైంది. 90 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టింది.
Game set and match ✅
A comprehensive and dominant 9⃣0⃣-run victory for #TeamIndia 🥳👏
With that they clinch the #ZIMvIND T20I series by 2⃣-0⃣ with one game to play 🏆
Scorecard ▶️ https://t.co/Z8UUziVx8d pic.twitter.com/0hfpuJ6aCx
— BCCI (@BCCI) July 25, 2026
టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల భారీ ఛేదనను జింబాబ్వే దూకుడుగా మొదలెట్టింది. ఓపెనర్లు బెన్నెట్(32), బెన్ కరన్(1)లు దూకుడుగా ఆడినా.. అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్() తొలి దెబ్బ కొట్టాడు. దంచేస్తున్న బెన్నెట్‌ను ఔట్ చేసి బ్రేకివ్వగా.. ఆ తర్వాతి ఓవర్లోనే కరన్‌ను ప్రిన్స్ యాదవ్(2-10) పెవిలియన్ పంపాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో డియాన్ మైర్స్(12) బౌల్డవ్వగా 58 వద్ద ఆతిథ్య జట్టు మూడో వికెట్ పడింది.
కష్టాల్లో పడిన జట్టును ఆదుకోవాలనుకున్న కెప్టెన్ సికిందర్ రజా(0)ను ప్రిన్స్ డకౌట్‌గా వెనక్కి పంపి జింబాబ్వేను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దూబే ఓవర్లో మద్వేరా(2) అయ్యర్ చేతికి చిక్కడంతో ప్రత్యర్ధి ఓటమిని ఖాయమైంది. రియాన్ బర్ల్(20)ను తిలక్ ఔట్ చేయడంతో టీమిండియా విజయం మరింత తేలికైంది. బ్యాటుతో తేలిపోయిన అభిషేక్(3-17) బంతితో రాణించగా జింబాబ్వే 129 పరుగులకే కుప్పకూలింది.
🚨 𝟐𝐧𝐝 𝐓𝟐𝟎𝐈 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 🚨
ZIMBABWE 🇿🇼 1️⃣2️⃣1️⃣-8️⃣ (16) against INDIA 🇮🇳 | CRR : 7.56 | RRR : 24.75 | Target : 220
Current Batsman :
Tadiwanashe Marumani* : 3 (6)
Richard Ngarava* : 17 (15)Abhishek Sharma : 2-10 (2)#INDvsZIM #ZIMvIND #T20I…
— Cricket Lover 🏏 (@Crick97924Lover) July 25, 2026
ఇషాన్, తిలక్ విధ్వంసం
హరారే స్పోర్ట్స్ క్లబ్లో టాస్ ఓడిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(8) ఈసారి కూడా నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన అతడిని ముజరబని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ(20) జింబాబ్వే బౌలర్లను భయపెట్టాడు. కానీ, అదే ఊపులో ఆడబోయి అతడు వికెట్ సమర్పించుకున్నాడు.

29కే రెండు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(25), ఇషాన్ కిషన్(81)లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును ఉరికించారు. తిలక్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకోగా రింకూ సింగ్(12) విఫలమయ్యాడు. ఇషాన్, తిలక్ విధ్వంసంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబని, నగవరా, ఎవాన్స్, న్యూమన్, బెన్నెట్లు తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

