Rains : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్ (Gujarat) లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్ (Ahmedabad), పటాన్‌లోని సిధ్పూర్ పట్టణాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.
వరద చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు, టెలీకమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడింది.