పాట్నా, జూలై 26: బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా నగరంలో ఓ అద్భుతం జరిగింది. కాటేసేందుకు వచ్చిన నాగుపామును ఓ ఏడాది పసిబిడ్డ కొరకడంతో ఆ పాము అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత స్పృహ తప్పిన పిల్లాడిని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందచేయడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
తన ఇంటి సమీపంలో నేల మీద ఆడుకుంటున్న ఏడాది బాలుడు గోవింద చేతిని నాగుపాము చుట్ట చుట్టుకుంది. తన ముఖానికి అత్యంత సమీపంలో ఉన్న ఆ నాగుపామును చూసి ఏదో ఆట వస్తువనుకుని ఆ పిల్లాడు తన పదునైన దంతాలతో దాన్ని కొరికాడు. దీంతో అక్కకికక్కడే పాము చనిపోయింది.