Snake in Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి (Sri Kalahasti) లోని రాహుకేతు ఆలయం (Rahukethu temple) లో పాము కలకలం రేగింది. ఆలయ ప్రాంగణంలోకి 7 అడుగుల పొడవున్న పాము ప్రవేశించడంతో భక్తులు హడలిపోయారు. రాహుకేతు పూజలు జరిగే మండపం మెట్ల వద్ద పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.
దాంతో ఆలయ అధికారులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
శ్రీకాళహస్తిలోని రాహుకేతు ఆలయంలో 7 అడుగుల పాము
రాహుకేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద 7 అడుగుల పాము హల్చల్ చేసింది.. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు.
ఫారెస్ట్ అధికారులకు భక్తులు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకొని సంచీలో బంధించి అడవుల్లో విడిచిపెట్టారు.#Srikalahasti pic.twitter.com/upBkhNMNT9
— greatandhra (@greatandhranews) July 27, 2025