మాలలను మోసగించిన రేవంత్‌కు గుణపాఠం తప్పదు
హక్కులను కాలరాస్తూ మాలలకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు.
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ
హిమాయత్‌నగర్, మార్చి 16: హక్కులను కాలరాస్తూ మాలలకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసన్నల్లో ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు. సోమవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా నివేదికను సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మాలలు దూరం అవుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు తీరని అన్యాయం జరుగడంతో విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టం వాటిలుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

