హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ సోమవారం ప్రకటనలో తెలిపింది. 17,18న రద్దీ ఎకువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది. 23 వరకు తగిన ఏర్పాట్టు చేసినట్లు వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనంగా టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలిపింది. ప్రత్యేక బస్సులకు ప్రభుత్వ జీవో ప్రకారమే టికెట్ ధరలను సవరించినట్టు పేర్కొన్నది.