తిమ్మాపూర్, మార్చ్ 16 : అక్రమ ఆస్తుల కేసులో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్ర కారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్ కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ ఉద్యోగుల ఫైల్స్, కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడానికి తన స్నేహితుడి పేరు మీద ఓ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్ తీశాడు. అతని అకౌంట్‌కు రూ.14.77 లక్షలు జమ చేయించాడు. ఇటీవల వీరి మధ్య విభేదాలు రాగా మధుసూదన్ అవినీతి చిట్టాను స్నేహితుడు బయటపెట్టాడు. అక్ర మ సంపాదనను తన ఖాతాకు బదిలీ చేయించేవాడని ప్రూఫ్స్‌తో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సూపరింటెండెంట్‌ను కార్యాలయంలో అరెస్టు చేసి కరీంనగర్ కోర్టుకు తరలించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
కామారెడ్డి బల్దియాలో ఏసీబీ సోదాలు
కామారెడ్డి, మార్చి 16: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సో మవారం సోదాలు నిర్వహించారు. రికార్డులను తనిఖీ చేశారు. గత రెండేండ్లలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చాయ ని, 400కు పైగా వాణిజ్య దుకాణాలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంధన చార్జీ ల కోసం మున్సిపల్ అధికారులు నెలకు రూ.12.40 లక్షల మొత్తాన్ని కేటాయించినా సరైన రికార్డులు నిర్వహించలేదని, కొంత మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల కు గైర్హాజరైనా పూర్తి నెల జీతాలు క్లెయిమ్ చేసినట్టు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వానికి రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్టు తనిఖీల్లో వెలుగు చూసిందని పేర్కొన్నారు. అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పిస్తామని తెలిపారు.