Operation Sindoor : పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా భారత సైన్యం (Indian army) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ వివరాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ స్పందించింది.
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్‌ను సిలబస్‌లో చేర్చుతున్నట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనకున్న లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం ఎన్ సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఈ మాడ్యూల్ రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3-8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు.
ఆదిత్య ఎల్1 చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.