న్యూఢిల్లీ : కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల కట్టడి.. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్ల ఏర్పాటులో కేంద్రం విఫలమైందని ఇటీవల ఆరోపించిన ఆయన.. శనివారం మరోసారి దేశంలో కరోనా దుస్థితిపై స్పందించారు. కొవిడ్ మహమ్మారి మధ్య అనవసర ప్రాజెక్టులపై ఖర్చు చేయకుండా టీకాలు, ఆక్సిజన్, ఇతర ఆరోగ్యసేవలపై దృష్టి సారించాలని సూచించారు. కొవిడ్ సంక్షోభం మధ్య కేంద్ర ప్రజాపన్నుల శాఖ మంత్రిత్వశాఖల భవన నిర్మాణం కోసం ఇటీవల టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని, దాన్ని ఎదుర్కొందునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత దుస్థితి భరించలేనిదని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం దేశంలో రికార్డు స్థాయిలో 3.46లక్షల కరోనా కేసులు రికార్డయ్యాయి. 2,624 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
सद्भाव से केंद्र सरकार से अपील है कि PR व अनावश्यक प्रॉजेक्ट पर खर्च करने की बजाए वैक्सीन, ऑक्सीजन व अन्य स्वास्थ्य सेवाओं पर ध्यान दें।
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2021
आने वाले दिनों में ये संकट और भी गहरायेगा। इससे निबटने के लिए देश को तैयार करना होगा।
वर्तमान दुर्दशा असहनीय है!
ఇవికూడా చదవండి..