‘మన శంకరవరప్రసాద్‌గారు’ గ్రాండ్ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న చిరంజీవి, నెక్ట్స్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్ సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇదిలావుంటే.. ఈ సినిమా కథకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తాజాగా వెలుగు చూసింది. ఈ మాస్ ఎంటర్టైనర్ సెకండ్ హాఫ్‌లో ఓ ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్‌ను దర్శకుడు బాబీ డిజైన్ చేశారట.
ఈ ఎపిసోడ్లో భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉంటాయని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. అందుకే పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చిరంజీవి పాత్రను బాబీ డిజైన్ చేసినట్టు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చిరంజీవి కొత్తగా కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు వెంకట్ కె.నారాయణ, లోహిత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సివుంది.