పాత్ర కోసం సర్వశక్తులూ ఒడ్డి శారీరకభాషను మార్చుకోవడం నేటి కథానాయకులకు పరిపాటైంది. ‘బైకర్’ సినిమాలో 18ఏండ్ల వయసున్న రేసర్‌గా శర్వానంద్ కొన్ని నిమిషాలు కనిపించాలి. దానికోసం తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నారు శర్వానంద్. ‘ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, లాంగ్ డిస్టెన్స్ పరుగులు, కఠినమైన వ్యయామాలతో శరీరకంగానే కాదు, మనసికంగా కూడా బలంగా మారాను’ అని శర్వానంద్ అన్నారు.
ఈ ప్రయాణంలో విజయం సాధించేందుకు యోగా తనకు ఉపయోగపడిందని, దీంతో బరువు తగ్గి మరింత షార్ప్‌గా తయారయ్యానని శర్వా చెప్పారు. ‘బలమైన నిర్ణయం ముందు, నిరాశ, నిస్పృహలు నిలువలేవన్న నిజం ఈ రెండేళ్ల ప్రయాణంలో నాకు అర్థమైంది. ఇది నటన కాదు.. నా రెండేళ్ల కష్టం. మారాలనే పట్టుదల ఫలితాన్ని రేపు తెరపై చూస్తారు’ అని నమ్మకంగా చెప్పారు శర్వానంద్. ఏప్రిల్ 3న ‘బైకర్’ విడుదల కానున్న విషయం తెలిసిందే.