దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
దేశంలో కరోనా విజృంభణ |

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి రెట్టింపు వేగంతో విస్తరిస్తుండడంతో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు శనివారం మూడు లక్షలకుపైగా కేసులు, రెండువేలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల వరకు కరోనా కేసులు నమోదవగా.. 7వేలకుపైగా జనం ప్రాణాలు వదిలారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
తాజాగా 2,19,838 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481కు చేరగా.. ఇప్పటి వరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. మొత్తం 1,89,544 మంది మహమ్మారితో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 13,83,79,832 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా టెస్టులు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 17.53లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు వరకు 27.61 లక్షల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
ఇవికూడా చదవండి..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
మయన్మార్‌లో ఆగని హింస.. ఇప్పటికీ 740 మంది బలి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

